వైఎస్సార్‌సీపీ దీక్షలకు ఏఐఎస్‌ఎఫ్ మద్దతు

పుంగనూరులో వైయస్సార్సీపి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏఐఎస్‌ఎఫ్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు మున్నా మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.