టీబీ ముక్త్ భారత్‌లో ఉచిత ఛాతీ ఎక్స్-రే శిబిరాలు
వాయల్పాడు మండలంలో టీబీ ముక్త్ భారత్–2.0 కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 10 నుంచి 19 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఉచిత డిజిటల్ ఛాతీ ఎక్స్-రే శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మనోహర్ రాజు తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్నవారు, అధిక ప్రమాద వర్గాలకు పరీక్షలు నిర్వహించి అవసరమైతే తదుపరి వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని టీబీ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని అధికారులు కోరారు.