పీలేరులో వైసీపీ నిరసన దీక్ష

పీలేరులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి హరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు టీ. నరేష్, కంభం ద్వారకనాథరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.