ప్రతి కుటుంబానికి సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే నల్లారి కిషోర్

అన్నమయ్య జిల్లా పీలేరు, కె.వి.పల్లి మండలాల్లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూటమి శ్రేణులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో చేపట్టిన రహదారులు, తాగునీటి, మౌలిక సదుపాయాల పనులను వివరించి, ప్రజల సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.