మెగా డీఎస్సీపై వైకాపా ఆరోపణలు అవాస్తవం: రాయ వెంకటరమణ నాయుడు

మెగా డీఎస్సీపై వైకాపా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు రాయ వెంకటరమణ నాయుడు అన్నారు.గురువారం వీరబల్లిలోనీ టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసమే వైకాపా వివాదాలు సృష్టిస్తోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, ప్రజలు వైకాపా వైఖరిని వ్యతిరేకిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.