పీలేరులో కొత్త ఎల్‌ఈడీ వీధి లైట్ల ప్రారంభం

పీలేరు పట్టణంలోని కోటపల్లి సర్కిల్, నాలుగు రోడ్ల కూడలి, అంబేద్కర్ సర్కిల్, కొండారెడ్డి సర్కిల్ తదితర ప్రాంతాల్లో కొత్త ఎల్‌ఈడీ వీధి లైట్లను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా చీకటి ప్రాంతాలను వెలుగులతో నింపుతున్నామని తెలిపారు. పట్టణంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అధికారులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.