ప్రజా సమస్యలపై సీపీఐ పాదయాత్ర ప్రారంభం

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీపీఐ జాతీయ సీనియర్ నాయకుడు కే. నారాయణ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై విమర్శలు చేసిన ఆయన ధరల పెరుగుదల, నిరుద్యోగం, మహిళల భద్రత, దళితులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు పాదయాత్రలు, అనంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ నాయకులు తెలిపారు.