వరంగల్ మహాసభ విజయవంతానికి గ్రామ కమిటీలు బలోపేతం చేయాలి: ఎమ్మార్పీఎస్

పీలేరు, ఆగస్టు 5(రాజనీతి): నవంబర్‌ 9న వరంగల్‌లో జరిగే ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలను బలోపేతం చేయాలని ఎమ్మార్పీఎస్ అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి కొట్టం సంజీవ్ మాదిగ పిలుపునిచ్చారు. పీలేరులో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమాన్ని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఇన్‌చార్జిలను నియమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.