ప్రధానమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
వాల్మీకిపురం, ఆగస్టు 5 (రాజనీతి): పీలేరు మండలం శివరాంపురానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు కావడి ప్రమీల చికిత్స కోసం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2.60 లక్షల చెక్కును మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అందజేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలిపారు. వాల్మీకిపురంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రమీల కుమారుడు గణేష్‌కు చెక్కును అందజేయగా, కుటుంబ సభ్యులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.