హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన పుంగనూరు న్యాయవాదుల సంఘం
పుంగనూరు, ఆగస్టు 5 (రాజనీతి): పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాష్ట్ర హైకోర్టులో చిత్తూరు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి బి. కృష్ణమోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసింది. పుంగనూరుకు మంజూరైన రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రస్తుత కోర్టు ఆవరణలోనే ప్రారంభించాలని కోరింది. దీనిపై జడ్జి సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు.