బిడ్డకు తల్లిపాలే నీరు, తల్లిపాలే ఆహరం. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

వాయల్పాడు ఆగష్టు 5 /8/26 నవజాత శిశువుకు తల్లిపాలే నీరు -తల్లిపాలే ఆహరం అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో ' ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు' చింతపర్తి గ్రామము అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను స్థానిక వైద్యులు డాక్టర్ జులేఖ బేగం ఆధ్వర్యంలో డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ మరియు అంగన్వాడీ పర్యవేక్షకులు భానులక్ష్మి నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంట లోపు...