ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమం.. 12వ డివిజన్లో గోపీనాథ్ విస్తృత ప్రచారం...
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచనల మేరకు 12వ డివిజన్ ఇన్చార్జ్ గోపీనాథ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రచారంలో వివరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూ ప్రభుత్వ పనితీరుకు మరింత బలం చేకూరుస్తున్నారని పేర్కొంటున్నారు.చిత్తూరు అభివృద్ధే...