మరో రెండు నెలల తర్వాతే స్థానిక ఎన్నికలు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టీకరణ

కోర్టు కేసులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, రిజర్వేషన్ల ఖరారే ఆలస్యానికి కారణం.. ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టీకరణ రాజనీతి ప్రతినిధి, అమరావతి | ఆగస్టు 4, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక స్పష్టత ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఆలస్యం వెనుక న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ పూర్తి కావడం, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలే ప్రధాన కారణాలని...