రేపు ఏపీ కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్..
రాజనీతి ప్రతినిధి, అమరావతి | ఆగస్టు 4, 2026 ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 5న కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఏబీవీపీ నాయకుల ఆరోపణల ప్రకారం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రైవేట్ కళాశాలలు బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నాయని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కూడా...