మత్తుతో జీవితాలు నాశనం..ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయని, సమాజానికి మంచిది కాదని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రాజయోగిని దాది ప్రకాశమణి పావన స్మృతి పురస్కరించుకొని చిత్తూరు సాంబయ్య కండిగలోని ఓం శాంతి యోగ భవన్ లో జరిగిన "నశా ముక్త భారత్ అభియాన్, మిషన్ స్పందన్" కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి యువత, ప్రజలు శాంతియుత జీవనం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. యోగ, ధ్యానం వంటి అలవాట్లను జీవనంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఈ ధ్యానం చేశారు. పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు సీకే...