ప్రజల మన్ననలు పొందుతున్న అధికారి.. ఏపీసీఆర్డీఏ గ్రేడ్-1 కమిషనర్ శేఖర్ సేవలు విశేషం....
(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):విజయవాడలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-1 కమిషనర్ శేఖర్ తన సేవా దృక్పథంతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, వారి సమస్యలను ఓర్పుగా వినడం, పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోందని స్థానికులు చెబుతున్నారు.ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించే అధికారిగా శేఖర్‌కు మంచి గుర్తింపు ఏర్పడింది. అధికారుల కార్యాలయాలకు వెళ్లాలంటే సాధారణ ప్రజలు సంకోచించే పరిస్థితుల్లో, ఆయన మాత్రం అందరికీ అందుబాటులో ఉంటూ సానుకూలంగా స్పందిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.సమస్య చిన్నదైనా, పెద్దదైనా సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంటున్నారు.కార్యాలయానికి వచ్చిన ప్రతి వినతిని శ్రద్ధగా...