ఆగస్టు 30 వరకు ఓటరు నమోదు, వివరాల సవరణకు అవకాశం
రాజనీతి, అమరావతి | ఆగస్టు 4, 2026 SIR ప్రక్రియలో ప్రజలకు మరో అవకాశం.. కొత్త ఓటర్లు నమోదు, తప్పుల సవరణ, అభ్యంతరాలకు గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదు, వివరాల సవరణ, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, సవరణల దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు తమ పేరు, చిరునామా, వయస్సు, కుటుంబ వివరాలు, పోలింగ్ కేంద్రం వంటి...