మళ్లీ ప్రాణం పోసుకున్న ఆరోగ్యవరం ఫుట్‌బాల్ మైదానం – క్రీడాకారులకు సిద్ధమైన క్రీడా వేదిక
ఆరోగ్యవరం | రాజనీతి 2026 ఆగస్టు 3: ఎన్నో తరాల ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దిన చారిత్రాత్మక ఆరోగ్యవరం ఫుట్‌బాల్ మైదానం పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో మైదానం మళ్లీ యువత అడుగులతో కళకళలాడేందుకు సిద్ధమైంది. జాతీయ రహదారి విస్తరణతో మైదానంలో కొంత భాగం కోల్పోయినప్పటికీ, దాని చరిత్రను, క్రీడా వారసత్వాన్ని కాపాడాలనే సంకల్పంతో ట్రినిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు (Founder & Correspondent) నేషి మరియు జి. రతీష్ బాబు తమ స్వంత నిధులతో పునరుద్ధరణ పనులను ప్రారంభించగా వీరితో పాటు గ్రామ పెద్దలు రాజేష్ సువార్త, ప్రభా, ఆర్.ఎం. సునీల్, స్టాన్లీ కమలేశన్, టీ.లక్ష్మీపతి ప్రత్యక్షంగా పాల్గొని పనుల పర్యవేక్షణతో...