మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరామర్శ

వాల్మీకిపురం, ఆగస్టు 3 (రాజనీతి): పీలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సోమవారం వాల్మీకిపురం మండలం బోయపల్లిలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పల్లపు రెడ్డప్ప సతీమణి పల్లపు లక్ష్మీదేవి (45) మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శోకసంతప్త కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనోధైర్యంతో ఉండాలని ఓదార్పునిచ్చారు.