పీలేరు అభివృద్ధికి ఉద్యమం తప్పదు: సీపీఐ
పీలేరు, ఆగస్టు 2 (రాజనీతి): పీలేరులో జరిగిన మూడు రోజుల సీపీఐ జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ పీలేరు అభివృద్ధికి ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. మూతపడిన నువ్వుల గింజల కర్మాగారాన్ని పునఃప్రారంభించడం, హంద్రీనీవా కాల్వలు, జరీకోన–అడవిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడం, కొత్త పరిశ్రమలు, మహిళా ఉర్దూ డిగ్రీ, వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.