సంగీత జగతిలో మహోన్నత శిఖరం ఎస్. జానకి: జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

చిత్తూరు, ఆగస్టు 2 (రాజనీతి): సంగీత ప్రపంచంలో మహోన్నత శిఖరంగా నిలిచిన గానకోకిల ఎస్. జానకి ప్రతిభ చిరస్మరణీయమని జిల్లా పరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు అన్నారు. బ్రెయిన్ బాక్స్ అకాడమీలో భారతీయ తెలుగు రచయితల సమాఖ్య, ఎం.వి. కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఎస్. జానకి గానవైభవం" కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆమె సేవలను కొనియాడారు. అనంతరం 40 మందికి "జానకి స్మారక జాతీయ పురస్కారాలు–2026" ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.