క్రీస్తును అనుసరించడం మాటల్లో కాదు... కనికరంతో జీవించడంలో కనిపిస్తుంది....
గాయాలను చూసి దాటిపోవడం సులభం... గాయపడిన మనిషిని చేరుకోవడమే నిజమైన ప్రేమ. మనిషి జీవితంలో జ్ఞానం, ఆస్తి, హోదా కంటే గొప్పది ప్రేమతో కూడిన కనికరం. బైబిలులో యేసుక్రీస్తు చెప్పిన “మంచి సమరయుని ఉపమానం” మనిషిని మనిషిగా నిలబెట్టేది కనికరమేనని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుండగా దొంగల చేతికి చిక్కాడు. వారు అతని వస్త్రాలు తీసుకొని, తీవ్రంగా కొట్టి, చావుబతుకుల మధ్య రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. కొంతసేపటికి ఒక యాజకుడు ఆ మార్గంలో వచ్చాడు. గాయపడిన వ్యక్తిని చూసినా అతనికి సహాయం చేయకుండా దాటిపోయాడు. తరువాత ఒక లేవీయుడు కూడా అదే విధంగా వెళ్లిపోయాడు. అయితే సమాజంలో తక్కువగా చూడబడిన ఒక...