కూటమి పాలనపై వైసీపీ నాయకులు ఆరోపణలు మానుకోవాలి :తెలుగుదేశం యువ నాయకుడు రాయ వెంకటరమణ నాయుడు

వీరబల్లి : గత కొద్దిరోజులుగా వైసీపీ నాయకులు కూటమి పరిపాలన అభివృద్ధి చూసి ఓర్వలేక కూటమి నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజంపేట టీడీపీ యువ నాయకుడు రాయ వెంకటరమణ నాయుడు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీకి అండ.. ప్రతిపక్షంలోకి రాగానే రైతుల పట్ల ప్రేమ వలకపోస్తున్నారని తెలిపారు.అక్రమ ఇసుక తవ్వకాలపై ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నేతలు.. నేడు చెయ్యేరు వద్ద రాజకీయ నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.అన్నమయ్య ప్రాజెక్టు విపత్తుపై సమాధానం చెప్పకుండా.. ఇప్పుడు చెయ్యేరు ఇసుకపై హడావుడి ఎందుకు 40 మంది నిండు ప్రాణాలు కోల్పోయిన విషాదానికి నైతిక బాధ్యత ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు.ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం...