ఈ నెల 4న గుర్తింపు పొందిన పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
రాజనీతి ప్రతినిధి, అమరావతి | ఆగస్టు 1, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ నెల 4వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు ఎన్నికల షెడ్యూల్‌కు ముందస్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం, ప్రస్తుతం స్థానిక సంస్థల...