లంపిస్కిన్ నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభం

చౌడేపల్లి, ఆగస్టు 1 (రాజనీతి): మండలంలోని చిన్నకొండమర్రి గ్రామంలో పాడిపశువులకు లంపిస్కిన్ (ముద్ద చర్మవ్యాధి) నివారణ టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. శ్రీనివాసులు నాయుడు, డా. పవన్ కుమార్ ప్రారంభించారు. ఆగస్టు 31 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో 13 వేల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలని, వేపాకు పొగతో దోమలు, ఈగలను నివారించాలని రైతులకు సూచించారు.