వైఎస్సార్సీపీ సమన్వయకర్తను కలిసిన సీపీ రాఘవ రెడ్డి

మదనపల్లి, ఆగస్టు 1 (రాజనీతి): ఇటీవల వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా నియమితులైన సీపీ రాఘవ రెడ్డి శనివారం మదనపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రచార విభాగంలో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని రాఘవ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.