గుడిపాల మండలంలో ఏనుగుల సంచారం.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి...

రాత్రి వేళల్లో బయటకు రావొద్దని హెచ్చరిక – సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి.... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని పల్లూరు, వేప్పలమనుచ్చెను, పిల్లరీకుప్పం, పాపసముద్రం, ముత్తువల్లూరు, వీసీ కండిగ, వీఎన్ కండిగ, చిత్తపార గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని గ్రామస్థులు సూచిస్తున్నారు.ఏనుగులు వ్యవసాయ పొలాలు, గ్రామాల సమీపంలో సంచరిస్తుండటంతో రైతులు, కూలీలు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని...