ఎవరినీ కించపరచలేదు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్....

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):బెంగళూరు, చెన్నై నగరాలను చిత్తూరు వారు ఏలుతున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని కొందరు రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించి అనవసర వివాదానికి తెరలేపారని ఆరోపించారు. తెలుగు ప్రజలు దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా తమ ప్రతిభ, కృషి, నైపుణ్యంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఏ రాష్ట్రాన్ని, ఏ భాషను లేదా అక్కడి ప్రజలను కించపరిచేలా లేవని, అలాంటి ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగు వారి ప్రతిభను, కష్టపడే తత్వాన్ని ప్రశంసించే...