రోజుకు రూ.400 కూలీ.. కానీ GST బకాయి మాత్రం రూ.279 కోట్లు..! మహిళకు వచ్చిన నోటీసుతో షాక్
జాతీయం | 30 జూలై 2026 తమిళనాడులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేసే ఓ మహిళకు రూ.279 కోట్ల GST బకాయిలు చెల్లించాలంటూ నోటీసు రావడం తీవ్ర కలకలం రేపింది. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే మహిళ పేరుతో కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగినట్లు నమోదవడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. నోటీసు అందుకున్న మహిళ తాను ఎలాంటి వ్యాపారం చేయలేదని, GST నమోదు కూడా చేయించుకోలేదని స్పష్టం చేసింది. తన PAN కార్డు వివరాలను దుర్వినియోగం చేసి నకిలీ సంస్థను నమోదు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు, సంబంధిత...