కోర్టు స్టేటస్‌కో ఉన్నా భూమిలో ఫెన్సింగ్ చేస్తున్నారని ఆరోపణ

కోర్టులో వివాదం కొనసాగుతున్న తమ పూర్వీకుల భూమిలో కోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులను పట్టించుకోకుండా రాతి స్తంభాలు నాటి ఇనుప ఫెన్సింగ్ వేస్తున్నారని స్థానిక కోకావూరుకు చెందిన సి. కవిత ఆరోపించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మురకంబట్టు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 105/1లో తన భర్త సి. లోకనాథంనాయుడు పేరుపై 2.14 ఎకరాల సెటిల్‌మెంట్ భూమి ఉందన్నారు. ఆ స్థలంలో ఇప్పటికే ఒక ఇల్లు నిర్మించుకున్నామని, మరో ఇంటి నిర్మాణం చేపడుతుండగా అదే గ్రామానికి చెందిన మనోహర్ తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఈ భూ వివాదానికి సంబంధించి చిత్తూరు కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, స్టేటస్‌కో ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ...