‘రామాయణం’ ట్రైలర్ విడుదల..రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా పవర్‌ఫుల్ లుక్.. సాయి పల్లవి సీత పాత్రలో ఆకట్టుకున్న ట్రైలర్‌కు విశేష స్పందన

భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'రామాయణం' చిత్రం ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మముహూర్తంలో విడుదలైన ఈ ట్రైలర్‌లో విజువల్ గ్రాండియర్, అత్యాధునిక VFX, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో భారీ స్పందన లభించగా, సినిమా కోసం అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ప్రశాంతమైన, గంభీరమైన రూపంలో కనిపించగా, యశ్ రావణుడి పాత్రలో తన ఆగ్రహం, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించిన తీరు కూడా ప్రేక్షకుల ప్రశంసలు...