ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై లోకేష్ స్పెషల్ రివ్యూ, వేగం పెంచాలని అధికారులకు ఆదేశం!

జాబ్ క్యాలెండర్-2026 అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష.. ప్రతి నియామకం పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక సమీక్ష నిర్వహించారు. జాబ్ క్యాలెండర్-2026 అమలు, వివిధ శాఖల్లో కొనసాగుతున్న నియామకాలు, భవిష్యత్ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌పై అధికారులతో విస్తృతంగా చర్చించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియామక ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా...