చైనాలో ప్రకృతి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి, మరో 50 మంది గల్లంతు!
చాంగ్‌కింగ్‌లో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన.. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు అనుమానం, కొనసాగుతున్న సహాయక చర్యలు చైనాలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశంలోని చాంగ్‌కింగ్ మున్సిపాలిటీ పరిధిలోని పెంగ్‌షుయ్ కౌంటీలో ఇటీవల సంభవించిన భారీ కొండచరియల విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 41కు చేరింది. ఇంకా 50 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు శిథిలాల తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. జూలై 17న కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఒక్కసారిగా కూలిపడి, కొండ అడుగున ఉన్న నివాస భవనాలు, వ్యాపార సముదాయాలు, వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. ఘటన స్థలానికి వందలాది...