కర్ణాటకలో కలవరపెడుతున్న హెచ్‌ఐవీ కేసులు.. 7 వేల మందికి పైగా విద్యార్థులకు పాజిటివ్!

కాలేజీల్లో ప్రత్యేక హెచ్‌ఐవీ అవగాహన, కౌన్సెలింగ్ శిబిరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు – పరీక్షలు మాత్రం విద్యార్థుల సమ్మతితోనే కర్ణాటకలో యువతలో హెచ్‌ఐవీ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల 7 వేల మందికి పైగా విద్యార్థులు, యువకులు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించబడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించడంతో, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక హెచ్‌ఐవీ అవగాహన, కౌన్సెలింగ్ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, విద్యార్థుల అనుమతి లేకుండా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నివేదిక ప్రకారం, హెచ్‌ఐవీ...