ఐపీఎల్‌కు రూ.2 లక్షల కోట్ల విలువ.. బ్రాండ్ రేసులో ఆర్సీబీ నంబర్‌-1, సీఎస్‌కేను దాటేసిన కేకేఆర్!

ఐపీఎల్ వ్యాపార విలువ రికార్డు స్థాయికి.. తొలి రూ.300 మిలియన్ బ్రాండ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తాజా బ్రాండ్ విలువల నివేదిక ప్రకారం ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ 20.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు) దాటింది. గత ఏడాదితో పోలిస్తే 11 శాతానికి పైగా వృద్ధి నమోదై, ప్రపంచ క్రీడా రంగంలో ఐపీఎల్ వ్యాపార సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలిచింది. దాదాపు 312 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో...