డీఎస్సీ వివాదం ముదురుతోంది.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు, సీబీఐ విచారణపై పట్టుదల!
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు – విద్యాశాఖ మంత్రి రాజీనామా, సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో నిర్వహించిన ఆందోళనల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో ప్రశ్నపత్రాల లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెరిట్ జాబితాలో...