ఆపిల్ కొత్త 'అప్‌గ్రేడ్' ప్రోగ్రామ్.. నెలవారీ చెల్లింపులతో కొత్త డివైస్ మీ సొంతం!

ఒక్కసారిగా లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. నెలనెలా చెల్లిస్తూ కొత్త ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ వాడే అవకాశం! ప్రత్యేక కథనం ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా 'Apple Upgrade' పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఐఫోన్ మాత్రమే కాకుండా మ్యాక్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ వంటి పరికరాలను కూడా నెలవారీ చెల్లింపుల ద్వారా పొందే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఈ సేవ అమెరికాలో ప్రారంభమైంది. ఈ కొత్త విధానంలో వినియోగదారులు ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్ణయించిన కాలవ్యవధి పాటు నెలనెలా చెల్లింపులు చేస్తూ డివైస్‌ను ఉపయోగించవచ్చు....