ఆగస్టు నెలంతా ఆధ్యాత్మిక శోభ.. తిరుమలలో వరుసగా శ్రీవారి విశేష ఉత్సవాలు!
తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం వెల్లడించింది. ఆగస్టు నెలలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు, అలాగే వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించింది. ఈ సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అన్ని ఏర్పాట్లను చేపడుతోంది. ఆగస్టు నెలలో పవిత్రోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ప్రధాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వేదపారాయణాలు, అర్చనలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి. భక్తులు ముందస్తుగా దర్శనం, వసతి టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. అదేవిధంగా, 2026 వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్...