పరీక్షలపై మోసాలకు ఇక చెక్.. పేపర్ లీక్‌లపై కఠిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వరుసగా వెలుగుచూస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబించింది. ప్రజా పరీక్షల్లో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026కు లోక్‌సభ మంగళవారం వాయిస్ ఓట్ ద్వారా ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షలలో సంఘటిత మోసాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలపై మరింత కఠిన చర్యలకు మార్గం సుగమమైంది. కొత్త సవరణల ప్రకారం పేపర్ లీక్‌లు, పరీక్షల మోసాలకు పాల్పడే వారిపై శిక్షలను మరింత కఠినతరం చేయడంతో పాటు, విచారణ, న్యాయ ప్రక్రియను వేగవంతం చేసే నిబంధనలు తీసుకువచ్చారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, అభ్యర్థుల భవిష్యత్తును...