తిరుమల విగ్రహ చోరీ కేసు ఛేదనలో సహకరించిన ఆర్ఆర్ యాదవ్‌కు జిల్లా ఎస్పీ ఘన సన్మానం

తిరుపతి, జూలై 29 (రాజనీతి): తిరుమలలో సంచలనం సృష్టించిన విగ్రహ చోరీ కేసు దర్యాప్తులో కీలక సహకారం అందించిన సామాజిక సేవకుడు ఆర్ఆర్ యాదవ్ను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఘనంగా సన్మానించారు. కేసు ఛేదనలో కీలక ఆధారాలుగా నిలిచిన సీసీ కెమెరా ఫుటేజీ, ఫొటోలను పోలీసు శాఖకు అందించి నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడంలో విశేష సహకారం అందించినందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. తిరుమలలో జరిగిన విగ్రహ చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సమయంలో, దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆర్ఆర్ యాదవ్ ముందుచూపుతో తన దుకాణం...