మద్యం దుకాణాల తొలగింపునకు ఐద్వా వినతి

రేణిగుంట, జూలై 29 (రాజనీతి): రేణిగుంట పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన రెండు నూతన మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర కి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సర్వేష్ వైన్స్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం సర్కిల్ సమీపంలోని ఆద్యా వైన్స్ జనావాసాలు, పాఠశాలలు, దేవాలయాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు సమీపంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఉన్న మద్యం దుకాణాలను ప్రజల అభ్యంతరాల మేరకు తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు, మహిళలు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ దుకాణాలను తొలగించాలని కోరారు....