చిత్తూరు అభివృద్ధికి సీఎం వద్ద ఎమ్మెల్యే వినతి...
నీవా రీటైనింగ్ వాల్ నుంచి యూనివర్సిటీ వరకు ప్రతిపాదనలు... నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి.. చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలో చేపట్టాల్సిన ప్రధాన అభివృద్ధి పనులపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు 12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్, గురజాల సురేష్, సుబ్రమణ్యం నాయుడు కూడా పాల్గొన్నారు. సమావేశంలో చిత్తూరు నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు....