అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. లక్ష్మి నరసయ్య

ప్రెస్ నోట్ మదనపల్లె, జూలై 28: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. లక్ష్మి నరసయ్య అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశం మంగళవారం నిర్వహించబడింది. వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణ, అంతర్‌శాఖల సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (ICDS), పశుసంవర్ధక శాఖ, విద్యాశాఖ, ఫుడ్ సేఫ్టీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా (RWS), మున్సిపల్ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు హాజరయ్యారు....