ఢిల్లీలో కుండపోత వర్షం.. జలమయమైన రహదారులు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పలుచోట్ల రహదారులు నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ గంటల తరబడి నెమ్మదించింది. భారీ ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులకు వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, జలమయం అయిన రహదారులు, ట్రాఫిక్ సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రయాణికులు భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు,...