విద్యార్థుల నిరసనల్లో హింసపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. 'అధికారం దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు'

న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళనల సమయంలో అధికార దుర్వినియోగం లేదా అతిగా బలప్రయోగం చేసిన వారు ఎవరైనా చట్టం ముందు బాధ్యత వహించాల్సిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థులపై నమోదైన కేసులు, పోలీసుల చర్యలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. అదే సమయంలో నిరసనల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కూడా సమర్థనీయం కాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో అధికారులు...