జపాన్‌ను వణికించిన 7.1 తీవ్రత భూకంపం.. సునామీ హెచ్చరికతో తీరప్రాంతాల్లో హై అలర్ట్!

టోక్యో: జపాన్ దక్షిణ ప్రాంతాన్ని మంగళవారం శక్తివంతమైన 7.1 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. భూకంపం అనంతరం 1 మీటర్ ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తీరప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భూకంప కేంద్రం కుమమోటో ప్రిఫెక్చర్ సమీపంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కుమమోటోతో పాటు నాగాసాకి, కగోషిమా, ఫుకుఓకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రాంతాలకు అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేశారు. సునామీ ముప్పు దృష్ట్యా తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్ర తీరాలకు వెళ్లకుండా, వెంటనే ఎత్తైన...