ఎల్‌నినోపై అప్రమత్తం కావాలి.. రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున నీటి వినియోగంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటల స్థానంలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారులు...