మన్వెల్త్‌లో మరో పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో జ్ఞానేశ్వరి యాదవ్ సిల్వర్‌తో మెరిసింది!

గ్లాస్గో: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం సాధించి దేశానికి మరో పతకాన్ని అందించింది. పోటీలో ఆరంభం నుంచే నిలకడైన ప్రదర్శన కనబరిచిన జ్ఞానేశ్వరి, స్నాచ్‌లో 91 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 114 కేజీలు ఎత్తి మొత్తం 205 కేజీల లిఫ్ట్‌తో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె ప్రదర్శన భారత జట్టుకు మరో కీలక విజయాన్ని అందించింది. ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణ పతకంతో భారత్ ఖాతా తెరవగా, జ్ఞానేశ్వరి యాదవ్ రజతంతో భారత పతకాల సంఖ్య మరింత పెరిగింది....