మర్రికుంటపల్లిలో శ్రీ నల్ల గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవం.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు

కలికిరి మండలం,మర్రికుంట పల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల పాత హరిజనవాడ నందు వెలసిన శ్రీ నల్ల గంగమ్మ దేవాలయం ప్రారంభోత్సవ సందర్భంగా అమ్మవారి సేవ (కొలువు) లో పీలేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "సమాచార హక్కు చట్టం" అధ్యక్షులు మద్దిరాళ్ళ మల్లికార్జున, కలిగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సహదేవయ్య,, కలికిరి మండల ఎస్సీ సెల్ కార్యదర్శి రామకృష్ణ, మర్రికుంటపల్లి గ్రామపంచాయతీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సహదేవ, గంగయ్య,కృష్ణయ్య తదితరులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు.