ఏటా అసోంను ముంచెత్తుతున్న వరదలు.. ప్రకృతి విపత్తా? లేక మనుషుల తప్పిదమా?
గువాహటి: అసోంలో మరోసారి భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది వరదల కారణంగా ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోగా, 5 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీటమునిగిపోగా, వేలాది కుటుంబాలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అయితే అసోంలో దాదాపు ప్రతి ఏడాది ఇలాంటి వరదలు ఎందుకు వస్తాయనే ప్రశ్న మరోసారి చర్చనీయాంశమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్రహ్మపుత్ర నది స్వభావం, భారీ వర్షపాతం, హిమాలయ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే నీటి ప్రవాహం, కొండచరియలు విరిగిపడి నదిలో పేరుకుపోయే మట్టి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా అడవుల...